calender_icon.png 2 January, 2026 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నదులు కలుషితం.. ప్రజలు జీవించలేని పరిస్థితి

02-01-2026 03:29:28 PM

హైదరాబాద్: నది పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణపై అధ్యయనం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభలో శుక్రవారం తెలిపారు. లండన్, జపాన్, జర్మనీ, దక్షిణకొరియా, సింగపూర్ లో అధ్యయనం చేశామని పేర్కొన్నారు. గుజరాత్ లోని సబర్మతి నది అభివృద్ధి కోసం 60 వేల కుటుంబాలను అక్కడి ప్రభుత్వం తరలించిందని, ఉత్తర్ ప్రదేశ్ లోని గంగానది ప్రక్షాళన చేసి రివర్ ప్రంట్ ఏర్పాటు చేశారని సీఎం గుర్తు చేశారు.  నదిపరివాహాక ప్రాంతాలభివృద్ధిని బీజేపీ ఎన్నికల అజెండాగా మార్చిందన్నారు. 

నది పరివాహక ప్రాంతాల నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కోరామని, నిజాంలు చేసిన అభివృద్ధిని గత పాలకులు కనుమరుగు చేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. నదులు కలుషితం చేసి నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా చేశారని, హైదరాబాద్ నగరంలోని మురుగు కాలువలను మూసీ నదికి కలిపారన్నారు. మూసీ నది కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని, కలుషిత నీటీ నుంచి తమను కాపాడాలని వేలాది మంది విజ్ఞప్తి చేశారని ముఖ్యమంత్రి చెప్పారు.  

ఏడాదంతా మాసీ నదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని, మూడు సంస్థలు జాయింట్ వెంచర్ కింద మూసీ పునరుద్ధరణ చేపట్టాయన్నారు. గోదావరి నుంచి 20 టీఎంసీలు నగరానికి తరలించేలా ప్రణాళిక చేసి, హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేందుకు 15 టీఎంసీలు, మరో 5 టీఎంసీలు గండిపేటకు తరలించాలని యోచన చేశామని సీఎం తెలిపారు. రూ.7 వేల కోట్ల వ్యయంతో గోదావరి నదీ జలాలు తరలిస్తామని, అంతేకాకుండా మూసీ, ఈసీ, గోదావరి నదుల సంగమంగా అభివృద్ధి పనులు ప్రారంభింస్తామన్నారు. రెండేళ్లలో గోదావరి జలాలు గండిపేటకు తరలిస్తామని, అందుకోసం మార్చి 31లోగా టెండర్లు పూర్తి చేసి మొదటి దశ పనులు చేపట్టాలని యోచన చేశామని ముఖ్యమంత్రి వివరించారు.