calender_icon.png 2 January, 2026 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధికే మొదటి ప్రాధాన్యత

02-01-2026 04:39:58 PM

వాంకిడి సర్పంచ్ చునార్కర్ సతీష్

వాంకిడి(విజయ క్రాంతి): వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికైన చునార్కర్ సతీష్‌తో పాటు వార్డ్ మెంబర్లు ఉప్రే విమలబాయి, దుర్గం సునీతలను శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. భారతీయ బౌద్ధ మహాసభ అంబేద్కర్ సంఘం, సిద్ధార్థ యోజన సంఘం, రామాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చునార్కర్ సతీష్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ సూత్రాల ప్రకారమే దేశ పాలన వ్యవస్థ కొనసాగుతోందని అన్నారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఎటువంటి తారతమ్యం లేకుండా గ్రామ అభివృద్ధికి, సర్వతోముఖ సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను నమ్మి సర్పంచ్‌గా గెలిపించిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానని, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వార్డ్ మెంబర్లు ఉప్రే విమలబాయి, దుర్గం సునీతలు మాట్లాడుతూ తమపై చూపిన విశ్వాసానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.