24-12-2025 07:38:58 PM
రోగులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్డు పంపిణీ
కోదాడ: సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా పట్టణంలోని ఎస్ఆర్ఎం పాఠశాల విద్యార్థులు తమ దాతృత్వం చాటుకున్నారు. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్డు, దుప్పట్లు పంపిణీ చేశారు. తాము సేకరించిన డబ్బులను సేవా కార్యక్రమానికి వాడడం పట్ల పాఠశాల కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి విద్యార్థులను అభినందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరధ, వైదుయలు నరసింహారావు, నరేష్, శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.