calender_icon.png 14 May, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఎస్‌ఈ ఫలితాల్లో ఎస్‌ఎస్‌ఆర్ విద్యార్థుల ప్రతిభ

14-05-2025 12:00:00 AM

నిజామాబాద్, మే 13 (విజయక్రాంతి): సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో నిజామాబాద్ మాధవనగర్, జన్నేపల్లికి చెందిన ఎస్‌ఎస్‌ఆర్ గ్రూప్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలకు చెందిన కనక్ ఇనాని 476/500 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచారు.

రిచా బజాజ్ 465, సహస్వి శ్రీరాం 451, సంవేద్య 449, సహస్ర 448, శ్రీవేణు 446, శివ చైతన్య 444, నవ్య 443, కీర్తి రెడ్డి 441, యోషిత్ రెడ్డి 439 మార్కులు సాధించారని ఎస్‌ఎస్‌ఆర్  గ్రూప్ చైర్మన్ డా. మరయ్య గౌడ్, సీఈఓ హరిత గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను యాజమాన్యం  అభినందించింది.