14-05-2025 12:00:00 AM
కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో పాలిసెట్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 6,111 మంది హాజ రైనట్లు జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. కామారెడ్డిలో 2,766 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీపీ సాయి చైతన్య, కామారెడ్డిలో ఎస్పీ రాజేష్ చంద్ర పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ప్రశాంతంగా పాలిసెట్ పరీక్షలు
సూర్యాపేట, మే 13 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో పాలిసెట్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా పాలీసెట్ జిల్లా కోఆర్డినేటర్ కె సుజాత ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ఏ, బీ సెంటర్ లు, ఎస్వీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్ కే ఎల్ కే డిగ్రీ, పీజీ కళాశాల, శ్రీ మేధా, శ్రీనిధి జూనియర్ కళాశాలలో ఎనిమిది సెంటర్లలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ 1436 మంది బాలురు, 1362 బాలికలు మొత్తం 2798 మంది దరఖాస్తు చేసుకోగా 1330 మంది బాలురు,1260 మంది బాలికలు మొత్తం 2590 మంది హాజరైనట్టు తెలిపారు.