6 June, 2026 | 1:41 AM

వంజరి కులస్తులకు ఎస్టీ హోదా

06-06-2026 12:00 AM
  1. వారిని డీఎన్టీలుగా పరిగణించాలి
  2. అఖిల భారత వంజరి సేవా సంఘం డిమాండ్

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి) : తెలంగాణ వంజరి కులస్తులు కోల్పోయిన ఎస్టీ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని, తక్షణమే వారిని డీఎన్టీలుగా పరిగణించాలని కు లానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అఖిలభారత వంజరి సేవా సంఘం తెలంగాణ వంజరి సేవా సంఘం డిమాండ్ చేసింది.

శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీ డియా సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. 1978 వరకు ఎస్టీలుగా పరిగణింపబడ్డ వంజరి కులస్తులను ఒక చీకటి జీవో ద్వారా బీసీ (డి)లోకి మార్చి ఐదు దశాబ్దాలుగా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ హోదాను పునరుద్ధరణ చేయాలని తక్షణ ఉపశమనంగా డీఎన్టీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

వంజరి కులస్తులకు ఆరాధ్యుడైన రాష్ట్ర సంతు భగవాన్ బాబా పుణ్యతిదులను అధికారికంగా నిర్వహించాలని, లోకప్రియ నేత గోపీనాథ్ ముండెకు భారతరత్ రత్న ప్రకటించి జయం తి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 7న ఉప్పల్ బగాయత్‌లో వంజరి కుల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి రాను న్న సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు వివిధ రాజకీయపక్షాలు అధికార గణం వంజరి కులస్తుల సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

ఆత్మగౌరవ భవన నిర్మాణం వంజరి కులస్తుల సొంత నిధులతో నిర్మించినట్టు తెలి పారు. గత ప్రభుత్వం ప్రకటించిన కోటి రూ పాయల నిధులు మంజూరు కాలేదన్నారు. భవన నిర్మాణ ట్రస్టులో బీసీ సంక్షేమ శాఖ నిబంధనలు అనుసరించి అన్ని రిజిస్టర్ సం ఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో అఖిల భార త వంజర సేవా సంఘం, తెలంగాణ బంజర సేవా సంఘం నాయకులు సాల్వేరు కృష్ణ, ఎదుగని శంకర్ నారాయణ ఎరుగని హరినాథ్ ధాత్రికా కాశీనాథ్ యుగంధర్, కాలేరు సురేష్, ఎదుగని వెంకటేష్ ముజకరి దినేష్, కానుకంటి శివప్రసాద్ రత్నం సంతోష్ అముద లక్ష్మణ్, మహదేవ్ ముండే, కాలేరు ప్రవీణ్ టిడిపి నర్సింగ్ రావు, కేంద్రీ మురళీకృష్ణ, కాలేరు సాయి బాబా, లక్ష్మీకాంత్  పాల్గొన్నారు.