వాసవి మాత ఆలయంలో అధిక జ్యేష్ఠ మాస పూజలు
పెబ్బేరు జూన్ 5:అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆర్యవైశ్య మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయాన్నే ఆలయ అర్చకులు కిట్టు స్వామి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య మహిళలు చిన్నమ్మవారి ఉత్సవమూర్తిని విశేషంగా అంలకరించారు.
పట్టణంలోని ఆర్యవైశ్య మహిళలు అంతా వాసవి మాత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణణ పారాయణం చేశారు. అమ్మవారికి 30 రకాల తీపి పదార్థాలు, వివిధ రకాల వంటలు తయారు చేసుకొని ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి వాయినాలు ఇచ్చారు. అదేవిధంగా చిన్నారులకు వివిధ రకాల స్వీట్లు, చాక్టెట్లు, ఫలహారాలతో వాయినాలు పెట్టారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆలయం తరఫున అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం మహిళలు అమ్మవారికి కుంకుమార్చన చేసి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం అర్చకులు కిట్టు స్వామి అమ్మవారికి మహా మంగళహారతి నీరాజనం ఇచ్చి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు అల్పాహారం వితరణ చేశారు.






