calender_icon.png 8 October, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభమేళాలో తొక్కిసలాట.. 30 మంది మృతి

29-01-2025 08:53:15 PM

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో జరుగుతున్న మహకుంభమేళా(Mahakumbh) తొక్కిసలాట ఘటనపై మహాకుంభ్ డీఐజీ ప్రెస్ మీట్(Press Meet) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. అలాగే తొక్కిసలాట మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించమని, మృతుల్లో మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందని డీఐజీ వెల్లడించారు. అర్థరాత్రి 1-2 గంటల మధ్యలో బారికేడ్ల ధ్వంసం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. మహా కుంభమేళాకు సంబంధించి వివరాలకు హెల్ప్ లైన్ నెంబర్(Helpline Number) 1920లో సంప్రదించాలని డీఐజీ మీడియా ద్వారా కోరారు. ఇవాళ కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించలేదని, కుంభమేళాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితి ఉందని డీఐజీ ప్రెస్ మీట్ లో చెప్పారు.