calender_icon.png 8 October, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్తుల సమయంలో మానసిక రోగులకు చికిత్సపై కార్యశాల

08-10-2025 03:42:45 PM

మేడ్చల్,(విజయక్రాంతి): ఆపదలు, విపత్తుల సమయంలో మానసిక రోగులకు ప్రాథమిక చికిత్స ఎలా అందించాలని అంశంపై మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కార్యశాల నిర్వహించారు. సైక్రియాటి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యప్రభ చికిత్సకు సంబంధించిన పలు అంశాలను వైద్య విద్యార్థులకు వివరించారు.

వారి సందేహాలను నివృత్తి చేశారు. ఇటీవల కామారెడ్డిలో సంభవించిన భారీ వరదల సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా స్థానికంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని విషయమై ఎంఐఎంఎస్ కు చెందిన పీజీ విద్యార్థిని డాక్టర్ స్ఫూర్తి కేసు స్టడీ రూపంలో వివరించారు. అనంతరం పోస్టర్, ఉపన్యాస పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ప్రిన్సిపల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. సైలేంద్ర, డాక్టర్ అనురాగ్ శ్రీవాత్సవ, డాక్టర్ ఈనాక్షి, డాక్టర్ మృదుల తదితరులు పాల్గొన్నారు.