calender_icon.png 8 October, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సారెస్పీ కాలువకు దామోదర్ రెడ్డి పేరు నామకరణం చేయాలి

08-10-2025 03:23:14 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గంలోని రైతుల అభ్యున్నతి దృష్ట్యా మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి హయాంలో ఎస్సారెస్పీ కాలువలు ఏర్పాటు కోసం రక్త తరపనం చేశారని, ఎస్సారెస్పీ కాలువలకు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు నామకరణం చేయాలని ఎఐసీసీ నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి డిమాండ్ చేశారు.

బుధవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి, ప్రత్యేకంగా ప్రతిపక్ష నాయకులకు లేఖ రాస్తానని అన్నారు. ఎస్సారెస్పీ కాలువకు ఆయన పేరు నామకరణం చేయాలని ప్రత్యేకంగా కోరారు. మాజీ మంత్రి   రాంరెడ్డి దామోదర్ రెడ్డి  పరమపదించినారు  వారి కుమారుడు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి  కలిసి వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.