calender_icon.png 8 October, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి

08-10-2025 04:25:00 PM

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే..

కామారెడ్డి (విజయక్రాంతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పనిచేసి జెడ్పిటిసితో పాటు ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల పదవులను కైవసం చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్లు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కష్టపడి పని చేస్తే వీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యానికి హామీలు అమలు చేయలేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ చేయాలని తెలిపారు. రైతులకు ఎన్నో గోసాలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజలకు వివరించాలన్నారు.

కరెంటు కొరత, యూరియా కోసం పడిగాపులు రాయడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు జరగలేదనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు రైతు కంటక నీరు రాలేదన్నారు. ఇలాంటి పడిగాపులు కాయడం జరగలేదన్నారు. రైతులకు సంతోషం ఉంచిన నాయకులు కేసీఆర్ మాత్రమేనని విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కేసీఆర్ వస్తే మళ్ళీ ప్రజలు రైతులు సంతోషంగా ఉంటారని తెలిపారు. జెపి మాజీ చైర్మన్ దఫెదర్ రాజు మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ అని కాంగ్రెస్ పార్టీకి ఇక నూకలు చెల్లయని తెలిపారు. బిజెపిని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని తెలిపారు. గడప గడపకు బీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలు కేసీఆర్ చేసిన పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో పిట్లం మాజీ జెడ్పిటిసి సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.