calender_icon.png 8 October, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠత

08-10-2025 03:26:07 PM

టీవీలకు అతుక్కుపోయిన జనం

వలిగొండ,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై బుధవారం హైకోర్టు ఇచ్చే తీరుపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. వలిగొండ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఏవిధంగా రానున్నదని జనం మధ్యాహ్నం 12 గంటల నుండి టీవీల ముందు కదలకుండా అతుక్కుపోయారు. మండల కేంద్రంలోని పలు షాపులలో రాజకీయ ఆసక్తి ఉన్న వారంతా టీవీల ముందు వీక్షిస్తూ కనిపించారు. హైకోర్టు తీర్పు లంచ్ తర్వాత రానుండడంతో రిజర్వేషన్లు మారాలని కొంతమంది రిజర్వేషన్లు అదేవిధంగా ఉండాలని కోరుకుంటున్న ఆశావాహులలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది.