calender_icon.png 8 October, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవనాలలో లీకేజీలు, సీపేజీల నివారణపై జాతీయ వర్క్‌షాప్‌

08-10-2025 03:38:44 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో సెంటర్‌ ఫర్‌ కన్ స్ట్రక్షన్స్ కెమికల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ స్టడీస్‌ రెహాబ్ టెక్నాలజీస్‌ సహకారంతో “భవనాలలో లీకేజీలు మరియు సీపేజీల నివారణ” అనే ఒక రోజు జాతీయ వర్క్‌షాప్‌ ను మంగళవారం అనురాగ్ యూనివర్సిటీలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంజినీర్‌ సి.శేఖర్ రెడ్డి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ఎస్టేట్ లిమిట్స్ హాజరయ్యారు. అతిథిగా డాక్టర్ పాదూరి శ్రీనివాసరెడ్డి, సీఈఓ, రెహాబ్ టెక్నాలజీస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీన్ ప్రొఫెసర్‌ డాక్టర్ వి. విజయకుమార్,  విద్యార్థులు, ఇంజినీర్లలో పరిశోధనాత్మక దృక్పథం పెంపొందించడానికి ఇలాంటి వర్క్‌షాప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈవర్క్‌షాప్‌ ప్రధాన ఉద్దేశ్యం భవనాల్లో నీటి లీకేజీలు, సీపేజీలను నివారించడానికి ఆధునిక వాటర్‌ప్రూఫింగ్‌ సాంకేతికతలను పరిచయం చేయడం, అలాగే స్థిరమైన నిర్మాణానికి అనువైన పరిష్కారాలను చర్చించడం. ఇండస్ట్రీ నిపుణులు అల్ట్రాటెక్‌, ఆసియన్ పెయింట్స్‌, ఆర్మెంట్‌, సికా ఇండియా, డాక్టర్ ఫిక్సిట్‌ వంటి సంస్థల ప్రతినిధులు వాటర్‌ ప్రూఫింగ్‌లో కృత్రిమ మేధస్సు, రీమిడియల్ టెక్నిక్స్‌, ప్రోడక్ట్‌ విశ్లేషణ, ఎత్తైన భవనాలలో అన్వయ సాంకేతికతలు వంటి అంశాలపై లెక్చర్లు ఇచ్చారు.