calender_icon.png 8 October, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంబీబీఎస్ సీటు సాధించిన సహస్ర

08-10-2025 04:27:49 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాలచెట్టు ప్రాంతానికి చెందిన పాలచెట్టు తాటికొండ రవికుమార్ స్రవంతి దంపతుల కూతురు తాటికొండ సహస్ర ఎ కేటగిరీలో ఎంబీబీఎస్ ఉచిత సీట్ సాధించింది. సిద్దిపేట సురభి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ వైద్య కళాశాలలో సీటు దక్కించుకుంది. బుధవారం కాళోజి నారాయణ రావు వైద్య విశ్వ విద్యాలయంలో నిర్వహించిన కౌన్సిలింగ్ లో నీట్ పరీక్షలో 4796 ర్యాంక్ సాధించి ఉచిత సీట్ సాధించింది. ఉచిత సీట్ సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఉచిత ఎంబీబీఎస్ సీట్ సాధించిన సహస్ర తండ్రి ఆర్ఎంపీ వైద్యునిగా పట్టణంలో సేవలందిస్తుండగా కూతురు ఎంబీబీఎస్ సీట్ సాధించడంతో పట్టణంలోని పలువురు ఆర్ఎంపీలు సహస్రను అభినందించి ఉత్తమ వైద్యురాలిగా పేరు సంపాదించి ప్రజలకు వైద్య సేవలందించాలని వారు ఆకాంక్షించారు.