9 May, 2026 | 2:40 AM

‘అమృత్ స్వస్థ్ భారత్’ ప్రారంభం

09-05-2026 12:19 AM

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో షురూ

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): హరీష్ బిసామ్ ఆధ్వర్యంలోని బిసామ్ ఫార్మా, సౌత్ సెంట్రల్ రైల్వేతో కలిసి క్విక్వైటల్స్ ఆధారిత ప్రివెంటివ్ హెల్త్‌కేర్, వైటల్ స్క్రీనింగ్ కార్యక్రమమైన అమృత్ స్వస్థ్ భారత్‌ను శుక్రవారం లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రారంభించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ స్టేషన్ మేనేజర్ ఎ రాజు ప్రారంభించగా, రైల్వే అధికారులు, ఆరోగ్య రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏఐ ఆధారిత ఆరోగ్య పరిష్కారాల ద్వారా ప్రజలకు ప్రివెంటివ్ హెల్త్కేర్ సేవలను మరింత అందుబాటులోకి, సాంకేతికంగా, సరసమైన ఖర్చుతో తీసుకురావ డంలో అమృత్ స్వస్థ్ భారత్ ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని బిసామ్ ఫార్మా తెలిపింది. రైల్వే ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, సాధారణ ప్రజలకు వేగవంతమైన, సులభమైన, పేపర్లెస్ ఆరోగ్య పరీక్షా సేవలను అందించేందుకు అమృత్ స్వస్థ్ భారత్‌ను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో బిసామ్ ఫార్మా, బిసామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు హరీష్ బిసామ్ పాల్గొన్నారు.