అందరి లక్ష్యం ఒక్కటే.. మన నగర అభివృద్ధే
మేయర్ గుమల్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
అన్ని పార్టీలు మేయర్, డిప్యూటీ మేయర్ ను ఏకగ్రీవం చేసిండ్రు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా చరిత్రలో పాలమూరు నిలిచిపోతుంది
ప్రజలకు సేవకులుగా పనిచేయండి భవిష్యత్తు మీదే
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మన అందరి లక్ష్యం ఒక్కటే.. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మం డనులు పొందుతూ అభివృద్ధి చేయడమేనని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిట శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్, డిప్యూటీ మేయర్ లు బాధ్యతలు స్వీకరిస్తూ సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు ఓట్లు వేసి మంచి చేయాలని సాంకేతాన్ని పంపిస్తారని ఆ నమ్మకాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటేనే మునుముందు ఎంతో భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మన జిల్లా వాసి కావడంతో అడిగినన్ని నిధులు మనకు అందిస్తున్నారని అద్భుతంగా ఉపయోగించి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎ మ్మెల్యే, ఎంపీ ఇలా ఇతర ఏ పదవుల్లోనైనా గెలిచేందుకు కొంత వెసులుబాటు ఉంటుందని కార్పొరేటర్ గా గెలవడం చాలా కష్టమ న్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తే మీరు ఎక్కడ ఉన్న ప్రజల మిమ్మల్ని ఆ హ్వానించి ఓట్లు వేసి గెలిపించుకుంటారని స్పష్టం చేశారు.
నగరమంతా ఒక కుటుంబంలో అనుకోవాలని ఆ కుటుంబంలో ఎవరికి ఆపద వచ్చినా మేమున్నాము అనే భరోసా ఇవ్వాల్సిన అవసరం మేయర్, డిప్యూటీ మేయర్లకు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి సమస్యను తమ సమస్యగా భావించి అడుగులు వేసినప్పుడే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. అధికారం వచ్చిన వెంటనే డబ్బు అహం వస్తే వారు ఎ ప్పుడూ నాయకులుగా ఎదగలేరన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరి మంచి కోసమే పరితపిస్తూ అడుగులు వేస్తుందని తమ వం తు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
- నిశితంగా గమనిస్తూనే ఉంటుంది :ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఎంతో నమ్మకం ఉంచి అప్పగించిన బా ధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని పార్టీ ఎల్లప్పుడు నిశ్చితంగా వేస్తున్న ప్రతి అడుగును గమనిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎ ప్పుడు కూడా అన్ని పార్టీలు ఏకమై మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకోవడం జరగలేదన్నారు. ఇంత ఆదర్శంగా బాధ్యతలను తీ సుకున్న వారు అంతే బాధ్యతగా ప్రతి కార్పొరేటర్ కు సముచిత స్థానం కల్పించాలని తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని నగరం అంతా మనదే అనే భావనతో ముందుకు సాగాలని సూచించారు.
- కట్టుబడి పని చేస్తాను : గుమల్ మమత, పాలమూరు కార్పొరేషన్ మేయర్
అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుం డా కట్టుబడి పని చేస్తానని పాలమూరు కా ర్పొరేషన్ మేయర్ గుమాల్ మమత అన్నా రు. పట్టణం పై పూర్తి అవగాహన ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సహకారంతో అభివృద్ధి తమ లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
- అద్భుతంగా పనిచేసి చూపిస్తాం : మారేపల్లి సురేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్
ఎవ్వరికి ఎప్పుడు ఇలాంటి ఆపద వచ్చినా తాము ఉన్నాము అనే భరోసా ఇ స్తూ అద్భుతంగా పనిచేసి చూపిస్తామని పాలమూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో గొప్ప అనుభవంతో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి అవకాశం కల్పించడం జరిగిందని వారి సహకారంతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తామని తెలిపారు. నియమ నిబంధనలు పాటిస్తూ ఎక్కడ అవినీతికి తావు లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బేక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రి, ఒలంపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్, కార్పొరేటర్లు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.




