14 April, 2026 | 12:44 PM

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించటమే ప్రభుత్వ లక్ష్యం

28-02-2026 12:15 AM

మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

మాగనూరు .ఫిబ్రవరి. 27. మండలంలోని రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందిస్తూ రైతుల కరెంటు కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి 33/11 కె.వి కరెంటు సబ్స్టేషన్ మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మాగనూరు మండల పరిధిలోని వడ్వా టు గ్రామ శివారులో 2కోట్ల,90 లక్షల రూపాయలతో 33/11 కెవి సబ్ స్టేషన్ కు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మండలంలో పెద్దవాగు తీరంలో చేతి పంపులు, బోర్లు, లిఫ్ట్రిగేషన్స్, ఉన్నందున రైతులకు కరెంటు లో వోల్టేజీ సమస్య లేకుండా తీర్చుటకోసమే సబ్ స్టేషన్ ను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడం జరిగిందన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులను తొందర్లోనే ప్రారంభమవుతాయని వారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పార్టీ అని రైతులకు కష్టాలు రాకుండా చూసుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నారు. అనంతరం మండల పరిధిలోని గురావు లింగంపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఏడి గంగాధర్, గ్రామ సర్పంచ్ రవీందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆనంద్ గౌడ్, మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి, శివరాం రెడ్డి, కొల్పూరు సర్పంచ్ ముత్తు రాములు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,జి.లింగంపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి,కాంగ్రెస్ నాయకులు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.