16 June, 2026 | 2:38 AM

వ్యాయామ ఉపాధ్యాయునికి రాష్ట్రస్థాయి ప్రశంసా పత్రం

16-06-2026 01:23 AM

గాంధారి, జూన్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని పోతంగల్ కలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  వ్యాయామ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు రాష్ట్రస్థాయి ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్టు మండల విద్యాధికారి శ్రీహరి తెలిపారు.. ముఖ హాజరు వ్యవస్థలో 90 శాతం కంటే ఎక్కువ హాజరు నమోదు చేసి, విధి నిర్వహణలో అత్యున్నత నిబద్ధత, క్రమశిక్షణ మరియు బాధ్యతయుత సేవలు ప్రదర్శించినందుకు రాష్ట్ర విద్యాశాఖ తరఫున ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. 

తమ పాఠశాలను వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు రాష్ట్రస్థాయిలో ప్రశంసా పత్రం అందుకోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాఠశాల కమిటీ చైర్మన్ గ్రామ సర్పంచ్ వ్యాయామ ఉపాధ్యాయున్ని ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుశ్రీ బాలరాజు , ఉప సర్పంచ్ సంజీవరెడ్డి, పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..