16 June, 2026 | 2:39 AM

కామారెడ్డి టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జికి సన్మానం

16-06-2026 01:25 AM

కామారెడ్డి, జూన్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఇన్చార్జిగా గైని శ్రీనివాస్ గౌడ్ ఇటీవల నియామకమయ్యారు. గైని శ్రీనివాస్ గౌడ్ అభిమానులు సోమవారం ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ మరింత ప్రతిష్ట వంతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా గైని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టిఆర్‌ఎస్ మండల, గ్రామ కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేస్తానని తెలిపారు.

నియోజకవర్గంలో గ్రామ, గ్రామానికి టీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను చేపడతామన్నారు. తనకు సపోర్టుగా కార్యకర్తలు నాయకులు ముందుకు వచ్చి సన్మానించినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో టిఆర్‌ఎస్ అధినేత్రి కవితమ్మ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కవితమ్మ నాయకత్వంలో కామారెడ్డి గడ్డపై టిఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు వేముల బలరాం, జిల్లా నాయకులు ఎరుకట్ల కిషన్, సదాశివ నగరం మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు చుక్క సాయ గౌడ్, టిఆర్‌ఎస్ జిల్లా యువజన నాయకులు జొన్నల రాము వినోద్ తదితరులు పాల్గొన్నారు.