calender_icon.png 21 October, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకాలంలో సీపీఆర్ చేస్తే ప్రాణాలను కాపాడవచ్చు

17-10-2025 12:22:59 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట. అక్టోబర్,16(విజయక్రాంతి): అకస్మాత్తుగా గుండె పోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీ పీ ఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చు అని, ఈ సీ పీ ఆర్ విధానంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్యాధికారులకు ఎం ఎల్ హెచ్ పి లకు సిపిఆర్ పై వేర్వేరుగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్  సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ సిపిఆర్ చేయడం, నేర్చుకోవడం వల్ల సగటు మనిషి ప్రాణాలను ఆగిపోయిన గుండెల్లో రక్తప్రసరణను మళ్లీ పెంపొందించడానికి అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణను ఉపయోగించుకోవాలని సూచిం చారు.

సిపిఆర్ చేయడం నేర్చుకొని సగటు వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి కృషి చేయాలని ఆరోగ్య శాఖలోని సిబ్బంది మాత్రమే కాకుండా సగటు మనిషి ఎవరైనా కూడా దీన్ని నే ర్చుకోవచ్చని చెప్పారు. ఈ శిక్షణ మొత్తాన్ని మహబూబ్ నగర్ నుండి వచ్చిన ఎంఐసియు డాక్టర్ రఘు రెడ్డి సి పి ఆర్ గురించి శిక్షణ ఇచ్చారు. ముఖ్యమైన అంశాలను వివరించారు.

అలాగే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్యాధికారులు పర్యవేక్షకులకు మరియు ఎమ్. ఎల్ . హెచ్. పి లకు సిపిఆర్ పైన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కే జయచంద్ర మోహన్ తో పాటు ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సత్య ప్రకాష్  ఎన్ సీ డి కోఆర్డినేటర్ విజయ్ కుమార్, అరవింద్ కుమార్ ,అశోక్ , సిబ్బందిపాల్గొన్నారు.