6 July, 2026 | 9:41 PM

Breaking News

చంద్రపురి డివిజన్‌లో సర్ కార్యక్రమంపై ఇంటింటి ప్రచారం   •   గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •  

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: డీఎస్పీ ప్రభాకర్

24-06-2025 12:45 AM

గీతం యూనివర్సిటీలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

పటాన్ చెరు, జూన్ 23 :మాదక ద్రవ్యాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో జరిగే దుష్ప్రభావాలపై గీతం యూనివర్సిటీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ అధ్యాపకులు, ప్రతినిధులు, పోలీస్ సిబ్బందితో, విద్యార్థులతో కలిసి  యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు. వీటి వినియోగంతో జీవితాలు, కుటుంబాలే నాశనం అవుతాయన్నారు. వాటి జోలికి వెళ్లకుండా చదువు, కెరీర్ వైపే దౠష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ వినాయకరెడ్డి, డీఐ రాజు, గీతం ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

బొల్లారం మున్సిపాలిటీలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో డ్రగ్స్ వినియోగంతో జరిగే చెడు పరిణామాల గురించి సీఐ రవీందర్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. పోలీస్ సిబ్బంది, అధ్యాపకులు, ఉపాధ్యాయులుపాల్గొన్నారు.