calender_icon.png 6 September, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తుల సౌలభ్యానికి క్యూలైన్ల ఏర్పాటుకు చర్యలు

06-09-2025 12:00:00 AM

తాడ్వాయి,సెప్టెంబరు5(విజయక్రాంతి):ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీసమ్మక్క సారలమ్మ దేవాలయంను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.ఎస్.పి. శబరిష్., కొత్త మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా గద్దెల ప్రకారం విస్తరణ ప్రణాళికలకు దేవాదాయ శాఖ అధికారులతో పాటు పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లకు అనుగుణంగా స్థలాన్ని పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్,ఎస్పి, శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం ప్రాంతం చుట్టూ కలియ తిరుగుతూ కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు వరుస ప్రకారం విస్తరణ ప్రణాళికలు, సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం కొరకు భక్తులు సౌలభ్యంగా క్యూలైన్ ల ఏర్పాటు, వి ఐ పి, వి వి ఐ పి ల, ఎంట్రి తదితర అంశాలను క్షుణ్ణంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వీరస్వామి, ములుగు డి.ఎస్.పి రవీందర్, దేవదాయ శాఖ డి ఈ సి హెచ్ రమేష్ బాబు, సంబంధిత అధికారులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.