06-09-2025 12:00:00 AM
డీఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్
మహబూబాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, రైతులకు తక్షణమే యూరియా అందించాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి డిఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలల నుండి రైతులు యూరియా కోసం అవస్థలు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
యూరియా అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే నని, యూరియా అందించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. యూరియా కొరత సృష్టించి కొందరు బ్లాక్ మార్కెట్లో యూరియాను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని, ఇలానే కొనసాగిస్తే బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు భీమా నాయక్, కార్యదర్శి వాసు నాయక్, డీ ఎస్ ఎఫ్ ఐ జాతీయ సహాయ కార్యదర్శి శాంతికుమార్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బుర్ర వీరభద్రం, కెలోత్ సాయికుమార్, కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్, కోర్ కమిటీ సభ్యులు ఎర్ర దిలీప్, దేవేందర్, సీహెచ్ రామ్ చరణ్,శివ వర్మ, పాల్గొన్నారు.