calender_icon.png 23 August, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకమైన పాలన కోసమే సమాచార హక్కు చట్టం

23-08-2025 12:00:00 AM

సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ. శ్రీనివాస్ రావు

గద్వాల్ ఆగస్టు 22: పాలనలో పారదర్శకత కోసమే 2005లో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ పి.వి. శ్రీనివాస్ రావు అధికారులకు సూచించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో పీఐ వో, అపిలెట్ అధికారులకు చట్టం పట్ల నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు దేశాల భూపాల్, శ్రీమతి. వైష్ణవి మేర్ల, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ , ఎస్పీ శ్రీనివాస్ రావులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలకమైన సాధనమని తెలిపారు. ఆర్టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులు త క్కువ అందిన జిల్లాల్లో జోగులాంబ గద్వాల జిల్లా ఓకటన్నారు. పీఐవో అధికారులు ప్రజలకు సమయానికి, పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. గత మూడు సంవత్సరాల నుండి 17వేల ఆర్టిఐ కేసులో పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు జి ల్లాల పర్యటనలు చేపట్టడం జరుగుతుందన్నారు.

ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో పర్యటించి కేసులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. సమావేశ అనంతరం పెండింగ్ లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులపై విచారణ నిర్వహించారు. సంబంధిత పీఐవో అధికారు లు, దరఖాస్తుదారుల నుండి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డిఓ అలివేలు, వివిధ శాఖల పిఐఓ లు, అప్పీలెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు