11-11-2025 12:00:00 AM
-వచ్చే మూడు, నాలుగు వారాలు అప్రమత్తంగా ఉండి ధాన్యం, పత్తి, సోయా కొనుగోలు చేయాలి
-రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కామారెడ్డి, నవంబర్ 10 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల, సహకార, సంబంధిత అధికారులతో సెక్రటేరియట్ నుండి సోమ వారం ధాన్యం, కాటన్, సోయా, కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై జిల్లా అధికారులతో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా సమీకృత కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం, పత్తి, సోయా, తదితర పంటల కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా అన్ని వసతులు కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని, వెంటనే కేంద్రాలను ప్రారం భించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని, వాతావరణ పరిస్థితులను రైతులకు తెలియజేస్తూ అప్రమత్తంగా ఉంచాలని, కేంద్రాలలో ప్యాడీ క్లీనర్స్, మాచర్ మిషన్, మిషనరీస్, గన్ని సం చులు, టార్పాలిన్లు, లారీలను సిద్ధంగా ఉం చుకోవాలని సూచించారు.
వచ్చే 3, 4 వారాలలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు, మిల్లర్లు, కాంట్రాక్టర్స్, హమాలీలు, అంశాలపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణ కొనుగోళ్ల విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. వీడి యో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నాణ్యమైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వరిధాన్యం కొనుగోలు లో రైతు ల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 187 ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాల ఆధ్వర్యంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో 233, ఐకెపి ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పురోగతి తీరు పై ఆరా తీసి గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, డిప్యూటి ట్రైనీ కలెక్టర్ రవితేజ,జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ పిడి సురేందర్, వ్యవసాయ శాఖ అధికారి మోహన్, డి సి ఓ రామ్మోహన్, డిఎం జ్యోతి, సివిల్ సప్లై వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.