25-07-2025 11:44:21 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో వీధి కుక్కల స్వైర విహారం తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీధి కుక్కలు ప్రధాన రహదారులపై గుంపులు గుంపులుగా తిరిగడం తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పశువులు కుక్కలు ప్రధాన రహదారులపై గుంపులు గుంపులుగా ఉండడంతో, మరోవైపు ప్రధాన చౌరస్తాలో వీధి దీపాలు లేక చిమ్మ చీకటిలో గమనించగా బాటసారిలు వాటికి తగిలిన కర్చే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.