26-07-2025 12:00:00 AM
జై గౌడ ఉద్యమం జిల్లా ఉపాధ్యక్షుడు కర్రోళ్ల శేఖర్ గౌడ్
కామారెడ్డి అర్బన్, జూలై 25 (విజయ క్రాంతి): గౌడ కులస్తుల సమస్యల కోసం అహర్నిశలు కృషి చేస్తానని జై గౌడ ఉద్యమం జిల్లా ఉపాధ్యక్షుడు కర్రోల శేఖర్ గౌడ్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో నూతనంగా ఉపాధ్యక్షునిగా నియామక పత్రం అందుకున్న అనంతరం మాట్లాడారు.
తనపై బాధ్యతను ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికూడి రామారావు గౌడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోల మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా నాయకులు ఇందూరి సిద్ధా గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్, తాటిపాముల ప్రశాంత్ గౌడ్, బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.