అంబేద్కర్‌కు కాంగ్రెస్ తీరని ద్రోహం
పచ్చగడ్డిలో పసిరిక పాము లాంటిది కాంగ్రెస్
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొప్పు కాంతికిరణ్
ఖమ్మం, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు భారతీయ జనతా పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కొప్పు కాంతి కిరణ్ ఉద్ఘాటించారు.
సోమవారం ఖమ్మం నగరంలోని ఐఎంఏ హాల్ లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ’మేధావుల సదస్సు’ ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ మహా సభకు డాక్టర్ కొప్పు కాంతి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సకల జనుల సంక్షేమం కోసం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ధ్వజమెత్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నిజమైన పాలన అందిస్తోందని నేతలు స్పష్టం చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను, మేధావులను వేదికపై ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సదస్సులో రాష్ట్ర నాయకులు, శ్రీరక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ గోంగూర వెంకటేశ్వరరావు, రుద్ర ప్రదీప్, కోటమర్తి సుదర్శన్, మండడపు సుబ్బారావు, మేకల నాగేందర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, నాయకులు బోయిన వెంకట్, వీరవెల్లి రాజేష్, ఆర్ వి ఎస్ యాదవ్, శ్రీకృష్ణ, జైదీప్, స్వర్ణకార్, ప్రభాకర్, ఫమ్మి అనిత, మంద సరస్వతి, నక్క రవిగౌడ్, రీగన్ ప్రతాప్,తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






