calender_icon.png 30 July, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

29-07-2025 11:21:16 PM

జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి..

దౌల్తాబాద్ (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులనే విక్రయించాలని, ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విత్తనాలు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి(District Agriculture Officer Swaroopa Rani) అన్నారు. మంగళవారం రాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి, అనాజీపూర్ ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ, ప్రతీ ఫర్టిలైజర్ దుకాణంలోని యూరియా నిల్వలను, కొనుగోలు పక్రియను, యూరియా స్టాక్ వివరాలను పరిశీలించారు.

అదే విధంగా బిల్లు బుక్, స్టాక్ రిజిస్టర్ లను, ధరల పట్టికలను పరిశీలించారు. ప్రతి రైతుకు అన్ని వివరాలతో కూడిన బిల్లును ఖచ్చితంగా ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా ఎరువులు, పురుగు మందులను ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయిస్తే ఎరువులు, పురుగు మందుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్మిన, అధిక ధరలకు అమ్మిన ఎరువుల చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని డీలర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.