మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హెచ్చరిక
హనుమకొండ, జూన్ 23(విజయ క్రాంతి):వాహనదారులు మైనర్లకు వాహనం అందజేసి వారి కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలకు వాహన యజమాని చట్టపరమైన చిక్కుల్లో పడోద్దని, తద్వారా కఠిన చర్యలు ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రతి పోలీసు అధికారి నిరంతరం కృషి చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం, కార్యక్రమాలను నిర్వహిస్తున్న కొంత మంది వాహనదారుల బాధ్యతరాహిత్య కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.ఈ రోడ్డు ప్రమాదాలు మైనర్ వాహనదారుల కారణంగా అధికంగా జరుగుతున్నాయని,
గత రెండు రోజుల క్రితం పర్వతగిరి పోలీస్ స్టేషన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్దులతో పాటు, ఒక మైనర్ బాలుడు మరణించగా, మరో మైనర్ బాలుడు తీవ్ర గాయలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడన్నారు.ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణంగా మైనర్ బాలుడు అతి వేగంగా వాహనం నడుపుతూ ఇద్దరు వృద్దులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా ఢీ కోట్టడం కారణంగానే అని, సంఘటన స్థలంలోనే మైనర్ బాలుడితో పాటు ఏ పాపం ఎగురుగని ఇద్దరు వృద్దులు మరణించారని,
ఈ సంఘటన చాలా బాధకరమైన విషయంఅన్నారు. ఈ సంఘటనపై ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయమని, ఇలాంటి రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి వుండాలని, ముఖ్యంగా మైనర్లకు వాహనం అందజేయడం చట్టరీత్యా నేరమని, ఇలా మైనర్లకు వాహనం అందజేయడం ద్వారా మైనర్ల డ్రైవింగ్ కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలకు వాహన యజమాని లేదా మైనర్ తల్లిదండ్రులు బాధ్యులుగా చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో వారిని జైలులు తరలించడం కూడా జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులను హెచ్చరించారు. ఇకనైన వాహనదారులు తమ వాహనదారులు మైనర్ డ్రైవర్లకు వాహనాలు అందజేయడం లేదా వారిని ప్రోత్సహించవద్దని పోలీస్ కమిషనర్ వాహనదారులకు సూచించారు.






