మహనీయుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): పార్టీ, రాజకీయాల కంటే దేశమే ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప నేత, దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక పార్టీ అధ్యక్షుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ అని కేంద్రమంత్రి బండి సంజయ్ కొనియాడారు. ఢిల్లీలోని మంగళ వారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అన్నారు.
దేశం కోసం యుద్దం చేయడానికి జనసంఘ్ పార్టీ కార్యకర్తలకు తుపాకీలిచ్చి పాకిస్తాన్‌పై యుద్దం చేయడానికి పంపిన వీరుడని పేర్కొరన్నారు. కాశ్మీర్ వెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిట్ కార్డు తప్పనిసరి చేస్తే నాదేశం వెళ్లడానికి పర్మి ట్ కార్డు ఎందుకని ప్రశ్నిస్తూ 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్‌ముఖర్జీ అని బండి సంజయ్ కొనియాడారు.






