calender_icon.png 4 December, 2024 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవలు అందించడంలో జాప్యం జరిగితే కఠిన చర్యలు

07-11-2024 06:32:21 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పౌరులకు అందించే వివిధ సేవలను సత్ఫరం అందించాలని సేవలు అందించడంలో జాప్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్తింపు పత్రాల జారీలో జాప్యం చేయడం వల్ల కొందరికి ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయని తెలిపారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను వెంటనే పరిశీలన చేయాలన్నారు, పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి పౌర సేవలను ప్రామాణికంగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.