calender_icon.png 29 October, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి

29-10-2025 01:01:39 AM

పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందర్నీ బదిలీ చేయాలని కోరిన ఎమ్మెల్యే

కరీంనగర్, అక్టోబర్28(విజయక్రాంతి): గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనలో ఉపాధ్యాయులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ తో ఫోన్లో మాట్లాడి పాఠశాలలో ఉపాధ్యాయులందరిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

విద్యార్థులను వేధించిన అటెండర్ యాకూబ్ పాషా విధుల నుండి పూర్తిగా తొలగించాలని సూచించారు. ఎమ్మెల్యే సూచన మేరకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ మెమొలు జారీ చేసినట్లు, ప్రతి ఉపాధ్యాయుని పాఠశాల నుంచి బదిలీ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఓరినట్లు ఎమ్మెల్యేతెలిపారు.