29-10-2025 01:19:08 AM
ఇంటర్మీడియట్ స్థాయిలో అన్ని విషయాలకు అంతర్గత మార్కులు ప్రవేశపెట్టే నిర్ణయం విద్యా వ్యవస్థలో ఒక ప్రగతిశీలమైన సంస్కరణగా పరిగణించవచ్చు. ఇప్పటివరకు విద్యార్థుల ప్రతిభను పూర్తిగా తుది పరీక్షల ఆధారంగా మాత్రమే అంచనా వేసే పద్ధతి ఉండేది. ఫలితంగా విద్యార్థుల మార్కుల కోసం చివరి క్షణంలో మెకానికల్‌గా చదివే అలవాటు పెంచుకున్నారు. కొత్త విధానం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు, అసైన్‌మెంట్‌లు, తరగతి ప్రవర్తన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నిరంతర మూల్యాంకనం చేసే అవకాశం లభిస్తుంది.
శ్రీనివాస్, కరీంనగర్