29-10-2025 01:06:19 AM
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుపై బీఆర్‌ఎస్ నేత పుట్ట మధు చేస్తున్న అసత్యప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, మచ్చ లేని మహా నాయకుడు శ్రీధర్‌బాబుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మధుకు ఇదే చివరి హెచ్చరిక అని, హద్దు దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ అధి కార ప్రతినిధి డాక్టర్ కొనగల మహేష్ పుట్ట హెచ్చరించారు.
రైజింగ్ తెలంగాణ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో శ్రీధర్‌బాబు విదే శీ పర్యటన ద్వారా రెండేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తూ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే జీర్ణించుకోలేక పుట్టా మధు అసత్య ప్రచారాలతో విషం చిమ్ముతున్నాడని మహేష్ తెలిపారు. అడ్వకేట్ దంపతులు వామన్‌రావు, నాగమణిలను నడిరోడ్డుపై నరికి చంపిన చరిత్ర పుట్ట మధుదని ఆరోపించారు.
తన శాఖలో కిందిస్థాయి ఉద్యోగి ద్వారా జరిగిన చిన్న పొరపాటు తన దృష్టికి రాగానే, విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని స్వయంగా మంత్రి ఆదేశాలిచ్చి, కార్యాలయ సిబ్బంది ద్వారా పోలీ సులకు ఫిర్యాదు చేయించారని, కింది స్థాయి ఉద్యోగిపై విచారణ జరుగుతున్నదని చెప్పారు. కానీ ఈ విషయాన్ని మంత్రి కి ఆపాదించేటట్టుగా న్యాయ ప్రక్రియమైన కనీస జ్ఞానం లేని పుట్ట మధు మాట్లాడటం బాధాకరమని మహేష్ తెలిపారు.
నేర చరిత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి పుట్ట మధు పగటి వేషాలు వేస్తున్నాడ ని విమర్శించారు. దుద్దిళ్ల కుటుంబం పెట్టి న భిక్షతోనే పుట్ట మధు మొదటిసారి జడ్పీటీసీ అయ్యాడని, జడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేస్తూ దైవ సమానులైన శ్రీధర్‌బాబు గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా నని చెప్పిన విషయాన్ని మర్చిపోయి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
10 ఏళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కూడా మంథని అభివృద్ధి కోసం మధుకర్ ఒక్క రూపా యి తేలేదన్నారు. పుట్ట మధు 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత మంథని ప్రాం తాన్ని బీహార్‌గా మార్చాలని చూశాడని విమర్శించారు. మళ్లీ ప్రజా ప్రభుత్వం వచ్చాక, మం థని ప్రశాంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి రౌడీ మూకల్ని అరికట్టి మంథని అభివృద్ధికి శ్రీధర్‌బాబు బాటలు వేస్తున్నారని చెప్పారు. శ్రీధర్‌బాబుపై అస త్య ప్రచారాలతో ఉనికి కోసం పుట్టా మధు పాకులాడుతున్నాడని మహేష్ వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీధర్‌బాబుపై ఇంకోసారి అసత్య ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామా లు ఉంటాయని మహేష్ హెచ్చరించారు.