29-10-2025 01:04:05 AM
కరీంనగర్, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా గంగాధర మం డలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను లైంగికంగా వేధించిన సం ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్‌కు మార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కలెక్టర్‌తో పాటు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. విద్యార్థులను వేధించిన అటెండర్ యాకుబ్ పాషాను విధుల నుంచి పూర్తిగా తొలగించాలని, ఉపాధ్యాయులను బదిలీచేయాలని డిమాండ్ చేశా రు.
హెడ్మాస్టర్ నిర్లక్ష్యం ఉందని, హెచ్ ఎం, సిబ్బంది పాత్రపై విచారణ జరగాలని, పోక్సోకేసు నమోదు చేయాలని కేంద మంత్రి కోరారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ సంఘటనపై ముగ్గురు సభ్యు ల అధికారులచే విచారణ జరిపించారు. ప్రధానోపాధ్యాయు రాలు కమల సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్లు తేలడంతో ఆమెను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లరాదని ఆదేశించారు.
ఇప్పటికే సబార్డినేట్ యాకూబ్ పాషాను సస్పెండ్ చే శారు. కలెక్టర్ నివేదిక ఆధారంగా రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్‌లోని రేకుర్తిచౌరస్తాలో నిందితుడు యాకుబ్‌పాషాను అరెస్టు చేశారు. ఈ నెల 27న కురిక్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేశారు.
విచారణ లో నిందితుడు వేధింపులకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరేళ్ల శారద జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కేసుపురోగతిని పర్యవేక్షిస్తామ ని, బాధిత విద్యార్థినులకు అన్నివిధాల సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.