calender_icon.png 29 October, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ కార్మికులకు 10 కోట్ల సంక్షేమ నిధి

29-10-2025 01:16:45 AM

  1. పిల్లలకు కృష్ణానగర్‌లో కార్పొరేట్ స్థాయిలో స్కూల్
  2. ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలు
  3. టికెట్ రేట్లు పెంచితే 20 శాతం వాటా
  4. మీరు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తెస్తా
  5. డిసెంబర్ 9న పూర్తి ప్రణాళిక ప్రకటిస్తా
  6. అభినందన సభలో సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలుగు చిత్ర పరిశ్రమకు, ము ఖ్యంగా సినీ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సినిమా టికె ట్ల ధరలు పెంచాలనుకుంటే, ఆ అదనపు ఆదాయంలో 20 శాతం వాటాను సినీ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తేనే అనుమతిస్తామని సంచలన ప్రకటన చేశారు. కార్మికుల కోసం ప్రభుత్వం తరఫున రూ.10 కోట్ల సంక్షేమ నిధి ని ఏర్పాటు చేస్తామని, వారి పిల్లల కోసం ప్ర త్యేకంగా కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తామని హా మీ ఇచ్చారు.

మంగళవారం సాయంత్రం యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ కార్మి క సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. కార్మికుల సమస్యలపై స్పం దించి వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే మదరాసీ అనేవారని, ఆ నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నా రెడ్డి.. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ వంటి మహానటుల సాయంతో పరిశ్రమను హైదరా బాద్ కు తీసుకొచ్చారని గుర్తుచేశారు.

సినీ కార్మికుల ఆత్మబంధువు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తన 10 ఎకరాల సొంత భూమిని చిత్రపురి కాలనీ కో సం దానం చేశారని చెప్పారు. ఆ త్యాగాలను మర్చిపోకూడదని, ఈ రోజు తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లిందంటే దాని వెనుక కార్మికుల శ్రమ, కష్టం ఉన్నదని కొనియాడా రు. అధికారంతో తన కండ్లు మూసుకుపోలేదని, సినీ కార్మికుల కష్టాలు తనకు తెలుస న్నారు. అందుకే భవిష్యత్తులో ఎంత పెద్ద సిని మా అయినా, టికెట్ ధరలు అదనంగా పెం చుకోవాలనుకుంటే, ఆ పెరిగిన మొత్తంలో 20 శాతాన్ని కార్మికుల సంక్షేమ నిధికి జమ చే స్తేనే ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని స్పష్టంచేశారు.

సినీ కార్మికులు ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే, దానికి రాష్ర్ట ప్రభుత్వం తొలి విడుతగా రూ.10 కోట్లు అందిస్తుందని ప్రకటించారు. కృష్ణానగర్‌లో మంచి స్థలం చూపిస్తే, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి, కార్మికుల పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత ప్రభు త్వానిదేనని హామీ ఇచ్చారు.

కార్మికులందరికీ ఆరోగ్య సమస్యల కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో కార్మికులకు ఇండ్ల స్థలాలు, సినీ ఫైటర్స్ ట్రైనింగ్ కో సం, ఇతర పరిశ్రమ అవసరాల కోసం స్థలా లు కేటాయిస్తామని తెలిపారు. నిలిచిపోయిన నంది అవార్డుల స్థానంలో, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరు మీద అవార్డులను ప్రారంభించామని గుర్తుచేశారు. 

హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తెస్తా

ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య వారధిగా ఉండేందుకే దిల్ రాజును ఫిల్మ్ డెవలప్‌మెం ట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించామన్నా రు. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేరాఫ్ కావాలన్నదే తమ ఆలోచన అన్నారు. తెలంగాణ రైజింగ్-2047లో ఇండస్ట్రీకి ప్రత్యేక స్థానం కల్పిస్తామన్నారు. పరిశ్రమ అండగా నిలబడితే హాలీవుడ్‌ను ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత తనదన్నారు. నవంబర్ చివరి వారం లో సినీకార్మికుల సమస్యలపై మరోసారి స మావేశమవుతామని, వారి సంక్షేమం కోసం ఏం చేయబోతున్నామో ప్రణాళికను డిసెంబర్ 9న ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు.