calender_icon.png 29 October, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవ్వాల్, అమ్రబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

29-10-2025 01:00:40 AM

  1. ఉద్యోగులు పనితీరును మెరుగు పర్చుకోవాలి
  2. పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ  

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఉద్యోగులు సమయపాలన పాటించడంతో పనితీరు మరింత మెరుగుపడుతోందని తెలంగాణ అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సువర్ణ తెలిపారు. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న వర్క్‌షాప్‌ను సువర్ణ ప్రారంభిం చారు. ఈ కార్యక్రమానికి 18 రాష్ట్రాల నుంచి ఐఎఫ్‌ఎస్ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ ఉద్యోగులుగా వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల మధ్య సమతుల్యత కీలకమని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయన్నారు. తెలంగాణలోని అమ్రబాద్, కవ్వాల్‌టైగర్  రిజర్వులు, అర్బన్ పార్కులు, ఏకో- టూరిజం ఆకర్షణలు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయన్నారు. అధికారులు తీరిక చూసుకుని ‘రైజింగ్ వైబ్రంట్ తెలంగాణ’ను సందర్శించాలని ఆమె సూచిం చారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ ఎస్‌జే ఆశా, డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ, అధికారులు పాల్గొన్నారు.