calender_icon.png 29 October, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్‌కర్నూల్ జిల్లాలో అతి భారీ వర్షాలు..!

29-10-2025 09:11:52 AM

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): మొంథా తుఫాన్ కారణంగా నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool district) వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు అతి భారీ వర్షం(Heavy rains) పడుతోంది. ఒక్క రోజులోనే మొత్తం జిల్లా వ్యాప్తంగా 1961 మిల్లీమీటర్ల (196.1 సెంటీమీటర్ల) వర్షపాతం నమోదైంది. ఉప్పునుతల183.2, అచ్చంపేట158.5, చారకొండ133.8, ఊర్కొండ124.3, తెల్కపల్లి121.2, బల్మూర్120.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. ఈ ఏడాది ఇదే అత్యధిక వర్షపాతంగా అధికారులు అంచనా వేస్తున్నారు. 

వర్షాల తీవ్రత కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారికంగా వెల్లడించింది. ఎస్ఏ వన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వర్ష తీవ్రత కారణంగా అనేక చోట్ల వాగులు, కుంటలు, చెరువులు పొంగిపొర్లి, రహదారులపై నీరు నిలిచిపోయింది. తక్కువ ఎత్తు ప్రాంతాలు నీటమునిగిన పరిస్థితులు ఏర్పడగా, అధికారులు అప్రమత్తం అయ్యారు. రోడ్డు రవాణాపై ప్రభావం చూపడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తూ, రక్షణ చర్యలను వేగవంతం చేశారు.