11-11-2025 08:44:32 PM
గుడుంబా విక్రయాలు చేసిన వారిని తహశీల్దార్ ఎదుట బ్యాండవర్ చేసిన పోలీసులు..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ప్రభుత్వ నిషేధిత గుడుంబా విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కన్నాయిగూడెం ఎస్సై ఇనిగాల వెంకటేష్ అన్నారు. వారం రోజుల క్రితం గుడుంబా విక్రయాలు చేస్తుండడంతో పోలీసులు రైడ్ చేశారు దోరికిన వ్యక్తుల పేర్లు చిట్టి బత్తుల గట్టమ్మ, తొంగరి సావిత్రి, బత్తిని వెంకటలక్ష్మి, బుద్దే ఇందిరాపైన తెలిపిన వ్యక్తుల వద్ద దాదాపుగా 40 లీటర్ల గుడుంబా పట్టుకోవడం కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.
ఇటీవలే కేసు నమోదు చేయబడిన పై వ్యక్తులు మరల గుడుంబా విక్రయిస్తే వారికి ప్రభుత్వం నుంచి రావలసిన బెన్ఫిట్స్ ఏవి కూడా రాకుండా పింఛన్ కట్ చేస్తానని వారికి కన్నాయిగూడెం తహసిల్దారు హెచ్చరించారు.అదేవిధంగా ఆరు నెలల జైలు శిక్ష ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గుడుంబా అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున ఎవరు కూడా చట్టవిరుద్యమైన పనులు చేయకూడదు అని కన్నయగూడెం ఎస్సై ఇనిగల వెంకటేష్ తో పాటు మండల తహసిల్దార్ ఎండి సర్వర్ గ్రామ ప్రజలకు సూచించారు.