calender_icon.png 11 November, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాం..

11-11-2025 08:42:10 PM

మాజీ మంత్రి జోగు రామన్న..

బేల (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల అభివృద్ధికి ప్రతి ఒక్కరు చేయూతను అందించాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. బేల ఉన్నత పాఠశాలను బీఆర్ఎస్ పార్టీ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మంగళవారం బేల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  70 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తుల ను విద్యార్థులకు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.... బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బేల ఉన్నత పాఠశాల కోసం కోట్ల రూపాయలు విధులు కేటాయించి పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు.

అందులో భాగంగానే అధికారంలో ఉన్నా లేకున్నా పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థులు ఉన్నతి కోసం బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు ముందుంటుందని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకోవడమే కాకుండా అన్ని రంగాల్లో రాణించేలా ముందుండాలని సూచించారు. దాతల సహాయం తో మరికొన్ని రోజుల్లోనే లక్ష రూపాయలతో పాఠశాల ఫర్నిచర్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రౌత్  మనోహర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు సతీష్ పవార్, తేజీరావ్ మస్కే, దేవన్న, మధుకర్ గోడే, మంగేష్ ఠాక్రే, తదితరులు పాల్గొన్నారు .