11-11-2025 08:59:14 PM
ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం,మైనార్టీ వెల్ఫేర్ డే)కార్యక్రమంను చరిత్ర విభాగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్, డి.నవీన్ అధ్యక్షత వహించి జాతీయ విద్యా దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం చరిత్ర విభాగ అధిపతి సిహెచ్ వెంకయ్య మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను, వారు చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి జ్యోతి,కనీస్ ఫాతిమా,సంపత్ జీవవేణి,రమేష్ రాజశేఖర్,శ్రీధర్ భావన,భాస్కర్,శ్రీకాంత్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.