calender_icon.png 11 November, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

11-11-2025 08:56:41 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల(స్వయం ప్రతిపత్తి)లో ఎన్ ఎస్ ఎస్, తెలుగు విభాగం ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మ దినోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపాల్, లెఫ్ట్ నెంట్ ప్రొఫెసర్ బి.చంద్ర మౌళి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి పూలమాల వేసిన నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపు కుంటున్నామని, భారత దేశ మొదటి విద్యా శాఖా మంత్రిగా సేవలను అందించారని అన్నారు. అలాగే విద్యార్థులకు వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు విభాగ అధిపతి ఎస్.మధు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లు డా. వి.మమత, ఇ. కవిత, వైస్ ప్రిన్సిపాల్ డా. జి.సుహాసిని, అధ్యాపకులు రాజేశ్వరి, డా.లక్ష్మీకాంతం, డా.సునీత, డా.పద్మ, డా.యుగంధర్, వివిధ విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.