calender_icon.png 11 November, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాకవి అందెశ్రీకి ఘన నివాళులు

11-11-2025 09:08:08 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): ప్రజా కవి అందెశ్రీకి కరీంనగర్ లోని కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ తరఫున అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ మట్టిలోని మాణిక్యం అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల కుటుంబంలో జన్మించి ఒక మహాకవిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పాట అయిన జయ జయహో తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించబడిన స్థాయికి ఎదిగిన అందెశ్రీ కి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు.

పేదల కోసం, బడుగుల కోసం, కార్మిక కర్షకుల కోసం, రైతు కూలీల కోసం, పకృతి కోసం, చివరగా తెలంగాణ కోసం గల మెత్తిన మహాకవి అందెశ్రీ అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు కడపల విజయకుమార్, పాటకుల భూమయ్య, బోయినపల్లి చంద్రయ్య, గజ్జల ఆనందరావు, పాస్టర్ తిమోతి, ఉరుమల్ల విశ్వం, బూత్కూరి కాంత, సిగిరి శ్రీధర్,  నాయిని  ప్రసాద్, ఎండి రజాక్  తదితరులు పాల్గొన్నారు.