calender_icon.png 11 November, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లిరోజు సందర్భంగా అయ్యప్పలకు అల్పాహారం సమర్పణ

11-11-2025 09:04:03 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): అయ్యప్ప స్వాముల కోసం పొగర్త పవన్ కుమార్, పొగర్త హిమాంబిక దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్పాహారం, భిక్ష సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు దంపతులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందసంతోషాలతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ సందర్బంగా సోములు యాదవ్ గురు స్వామి, బుచ్చిబాబు గురు స్వామి, నాగార్జున గురు స్వామి, బాలు యాదవ్ స్వామి, దశరథ్ స్వామి, సాయికిరణ్ గౌడ్ (బాబులు గౌడ్), నరేష్ స్వామి, వెంకట్ స్వామి తదితర అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.