11-11-2025 08:51:07 PM
వెంకటాపురం(నూగూరు) (విజయక్రాంతి): మండల పరిధిలోని పాలెం గ్రామ శివారులో వెంకటాపురం ఎస్సై కొప్పుల తిరుపతిరావు, మరో ఎస్సై సాయి కృష్ణలు మంగళవారం వాహన తనిఖీలను విస్తృతంగా చేపట్టారు. మంగళవారం వెంకటాపురం వారాంతపు మంగళవారం వెంకటాపురంలో సంతకావటంతో మండల కేంద్రానికి వచ్చే వాహనాల రాకపోకలు క్షుణ్ణంగా పరిశీలించారు. చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సరిహద్దు పోలీస్ సర్కిల్ కావడంతో మావోయిస్టుల తనిఖీలను సైతం ముమ్మరం చేశారు.
మంగళవారం తెల్లవారుజాము నుంచే బీజాపూర్ జిల్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎత్తున ఎన్కౌంటర్ సాగుతుండడంతో అటువైపుగా ఈ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చే అవకాశం సైతం ఉండడంతో గస్తీని మమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని శుడంక తనిఖీ చేయడంతో పాటు అనుమానిత వ్యక్తులను ప్రశ్నించే వివరాలు సేకరించారు. ఈ తనిఖీల్లో సివిల్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.