calender_icon.png 3 August, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనత్‌నగర్‌లో ఖబరస్థాన్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా: తలసాని

03-08-2025 05:25:04 PM

సనత్‌నగర్,(విజయక్రాంత్): సనత్‌నగర్ ప్రాంత ముస్లీం వర్గానికి సంబంధించిన ఖబరస్థాన్ సమస్యను పరిష్కరించేందుకు తాను పూర్తిస్థాయిలో కృషి చేస్తానని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.ఆదివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన కార్యాలయంలో పలుమసీదు కమిటీల ప్రతినిధులు, మత పెద్దల బృందం తలసానిని కలిసింది. ఖబరస్థాన్ లేకపోవడం వల్ల అంత్యక్రియలకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని, చాలా దూరంలోని ఖబరస్థాన్‌లకు మృతదేహాలను తరలించాల్సిన దుస్థితి ఉందని వారు వివరించారు. స్థానికంగా ఖబరస్థాన్ స్థలాభావం కారణంగా, బేగంపేట్‌లోని ఓల్డ్ కష్టమ్ బస్తీ ఖబరస్థాన్‌ను వినియోగించుకునేందుకు అక్కడి కమిటీని ఒప్పించేందుకు సహకరించాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.