calender_icon.png 3 August, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల ప్రాజెక్టును అన్ని దశలలో అడ్డుకుంటాం

03-08-2025 05:17:15 PM

అంతర్గాం,(విజయక్రాంతి): బనకచర్ల ప్రాజెక్టు ను అన్ని దశలలో అడ్డుకుంటామని, గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న  968 టీఎంసీల నీటి వాటా సంపూర్ణంగా వినియోగించుకునెలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని గోలివాడ వద్ద  రామగుండం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు,  ప్రభుత్వ సలహా  హరకర వేణుగోపాల్ ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, చింతకుంట విజయ రమణా రావు లతో కలిసి ప్రారంభించారు. 

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి   ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ  స్థానిక శాసన సభ్యుల కృషి మేరకు రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందని, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేందుకు కోటీ పది లక్షల రూపాయలు మంజూరు చేశామని, రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా రూ. 75 కోట్లు ఖర్చు చేసి అంతర్గాం, ముర్మురు, బ్రాహ్మణ పల్లి, ఎల్లంపల్లి సోమనపల్లి, మద్దిరాల , తొట్యాల పురం మొదలగు గ్రామాలకు,  ‌ 17 ఎల్ ద్వారా కుక్కల గూడూరు, నిట్టూరు గ్రామాలకు మొత్తం 13 వేల పైగా ఎకరాలకు నీరు చేరుతుందని, ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడంలో రవాణాశాఖ మంత్రి  ప్రభాకర్ కృషి ఎంతగానో ఉందన్నారు.