03-08-2025 05:28:27 PM
కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన ఉషోదయ యూత్ అసోసియేషన్ (యూవైఏ) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వడ్లకొండ సోమేష్ , ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ షాదుల్లా, ప్రధాన కార్యదర్శిగా కోణం శ్రీకాంత్, కోశాధికారిగా షాదుల్ హుస్సేన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఉషోదయ యూత్ అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు.
అనంతరం.. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, అసోసియేషన్ ను మరింత బలోపేతం చేస్తూ, మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని, దుద్దెడ గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ లో మరిన్ని సంస్కరణలు చేపడతామన్నారు. అనంతరం సభ్యులందరూ కలిసి భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. ఎన్నికల అధికారులుగా కాసాని మహేందర్ రెడ్డి, పెద్ది నాగరాజు, పొన్నం వెంకటేశం వ్యవహరించారు. కార్యక్రమంలో రవి, సత్యం,చక్రవర్తి, నాగరాజు, రఫీ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.