03-08-2025 05:34:02 PM
బిఆర్ఎస్వి డిమాండ్
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): పట్టణంలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సంఘం పర్మిషన్ లేకుండా నడుస్తున్న పాఠశాలను బంద్ చేయాలిని పర్మిషన్ వున్న పాఠశాలలు బంద్ కు పిలుపు నివ్వడం సరైన నిర్ణయం కాదని మా దృష్టికి మూడు రోజుల బంద్ అని వచ్చిందిని ఈ విధంగా బంద్ చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడంని మొదటి అసర్నమెంట్ పరీక్షలు జరిగే సమయంలో ఇలాంటి బంద్ ఏంటని వారు ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల యజమాన్యం ఆలోచించాలని, ఒకవేళ వారు నిరసన తెలుపాలంటే పాఠశాలను బందు చేయకుండా పాఠశాల వద్ద నిరసన కార్యక్రమం చేయాలన్నారు.
అనుమతులేని పాఠశాలల వివరాలను టిఆర్ఎస్వి మద్దతుతో స్థానిక విద్యాధికారికి ఇంతకుముందే ఫిర్యాదు చేయడం జరిగిందని గుర్తు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాయా కష్టం చేసి వేలాది ఫీజులు కడుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని పాఠశాలకు పంపిస్తే ఈ విధంగా బంద్ ల పేరుతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును పరిస్థితి ఏంటన్నారు. ఈ బందును వెంటనే వెనక్కి తీసుకోకపోతే టిఆర్ఎస్వి పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు డిమాండ్ చేశారు.